రామ అంజలి బామ్మకు సహాయం.;- కె. ఉషశ్రీ. 9వ తరగతిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉండేవారు. ఎల్లయ్య , పుల్లమ్మ వాళ్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ, అంజలి వీళ్లు ఇద్దరూ అక్క చెల్లెలు. వాళ్లు ప్రతి రోజు పాఠశాలకు వెళ్తారు. ఎల్లయ్య, పుల్లమ్మ వీళ్లు పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుతారు. ఒకరోజు రామ, అంజలి పాఠశాల నుండి వస్తుండగా ఒక బామ్మ కండ్లు కింద పడిపోయింది. అప్పుడు వెంటనే రామ అంజలి చూసి ఆ బామ్మను లేపి నీళ్లు తాగించారు. ఆ బామ్మ వాళ్లకు ధన్యవాదాలు చెప్పింది. ఆ బామ్మను రామ, అంజలి బామ్మ వాళ్ల ఇంటికాడ దిగబెట్టారు. బామ్మ కృతజ్ఞతగా అరటి పండు ఇచ్చింది. రామ అంజలి సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లి  అమ్మ, నాన్నకు ఈ విషయం చెప్తారు. అమ్మానాన్నలు సంతోషించారు.
నీతి, వృద్ధులకు సహాయం చేయాలి. వృద్ధులు ఆపదలో ఉన్నప్పుడు వారిని కాపాడాలి. రామ అంజలి బామ్మను కాపాడారు. అలాగే మనము ఆపదలో ఉన్న వారిని కాపాడాలి.

కామెంట్‌లు