పుష్కర ఉత్సవాన తిరుమలరావుకు సత్కారం
 విజయనగరంజిల్లా శిష్టకరణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం స్థాపించి 12 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహించిన పుష్కర ఉత్సవాన
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావును ఆ సంఘం సత్కరించింది. 
విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుమలరావును ఆహ్వానించగా హాజరై సత్కారం పొందారు. ఈ సందర్భంగా సంఘం రూపొందించిన పుష్కర ఉత్సవం అనే సంకలనాన్ని ఒరిస్సా రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ మురహరి శ్రీ రమణ్ గారు ఆవిష్కరించారు. అందులో తిరుమలరావు జీవితాంశాలు ముద్రితమగుటతో, ఆయనకు ఈ గౌరవం లభించింది. ఈ పుష్కర ఉత్సవం సంకలనాన్ని 
శిష్టకరణ సంఘ నేత కంటిమహంతి అనూష పట్నాయక్ చేతులమీదుగా బహూకరిస్తూ తిరుమలరావును సత్కరించారు.
ఈ సందర్భంగా తిరుమలరావును శిష్టకరణ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, సావనీర్ కమిటీ చైర్మన్ బలివాడ బాల భాస్కరరావు, సంపాదకులు నిడగంటి పట్నాయకుని ధూళికేశ్వరరావు, విశ్రాంత విద్యాశాఖాధికారులు వి.వి.నాగభూషణరావు, మురహరి విశ్వేశ్వరరావు, విద్యావేత్త తోనంగి భక్త వత్సలం, రాష్ట్ర సంఘ నేతలు డి.జి.ప్రసాదరావు, జె.వి.ఎస్.ప్రసాద్, జిల్లా సంఘ పూర్వాధ్యక్షులు ఆరికతోట చంద్రమౌళి, ఎం.పి.తిరుపతిరావు, సంఘనేతలు ఎస్.ఎన్.కె.మహంతి, 
విశ్రాంత ఉద్యోగులు బి.వి.జగన్నాధరావు, కుప్పిలి శశిభూషణరావు, టి.వి.గిరి, లోచర్ల ప్రభాకర్, బగ్గాం ప్రసాద్, రేగులవలస నాగేశ్వరరావు, కరకవలస ఉమామహేశ్వరరావు, పట్నాయకుని సునీల్ కుమార్,  మురహరిరావు ఉమా గాంధీ, గుణుపురం గౌరీ ప్రసాద్ తదితరులు అభినందించారు. 
ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ తన జీవిత అంశాలు ముద్రితమైయున్న ఈ పుష్కర ఉత్సవం సంకలనాన్ని ఒరిస్సా హైకోర్టు జడ్జి జస్టిస్ మురహరి శ్రీ రమణ్ ఆవిష్కరణ గావించుటతో పాటు, వారి పుట్టినరోజు వేడుకలను కూడా ఇదే వేదికపై నిర్వహించుట మిక్కిలి సంతృప్తినిచ్చిందని అన్నారు. అంతేగాక విజయనగరం జిల్లా కోర్టు సెంట్రల్ నాజర్ సీనియర్ సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీవిరమణ గావించిన పట్నాయకుని రామచంద్రరావు అభినందనసభ కూడా ఇదే వేదిక కావడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. తన సొంతూరు విజయనగరం జిల్లా కుదమ గ్రామం పార్వతీపురం మన్యం జిల్లాగా మారిననూ, తాను నివసిస్తున్న రాజాం, ఈ విజయనగరం జిల్లాలో చేరడంతో,  విజయనగరం జిల్లాతో పవిత్రమైన  అనుబంధం కొనసాగిందని తిరుమలరావు అన్నారు.
తిరుమలరావుకు జరిగిన సత్కారం పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

కామెంట్‌లు