శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
826)సహస్రార్చి -
=============
అనంతకిరణాలున్నట్టి వాడు 
వేయి కిరణములవెలుగువాడు 
సహస్ర కాంతిపుంజములవాడు 
లెక్కించలేని కిరణములవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
827)సప్త జిహ్వః -

ఏడు నాలుకలున్నట్టివాడు 
అగ్ని స్వరూపమునయున్నవాడు 
అగ్ని కీలల జిహ్వయున్న వాడు 
సప్త జిహ్వ నామాంతరమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
828)సప్తయిథా - 

సప్త దీప్తులను కలిగినవాడు 
కాంతికిరణములు యున్నట్టివాడు
తేజోవంతుడై వెలసినవాడు 
సప్తయిథా నామము గలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
829)సప్తవాహనః -

ఏడుగుర్రాల వాహనమున్నవాడు 
సప్తాశ్వరథము గలిగినవాడు 
సూర్యనారాయణ అంశనున్నవాడు 
సప్త వాహన నామమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
830)అమూర్తిః -

రూపము లేకుండినవాడు 
అదృశ్యముగా సంచరించు వాడు 
మూర్తిమత్వము ఎరుగనివాడు 
ఇట్టి రూపమని చెప్పలేనివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు