శ్రీ విష్ణు సహస్రనామాలు -(బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
791)సుందరః -

మిక్కిలి అందమైనట్టివాడు 
సుందరదేహము దాల్చినవాడు 
నయనములకాహ్లాదమైనవాడు 
సుందర ఆకృతిగలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
792)సుందః -

కరుణాస్వరూపుడయినవాడు 
దయార్థహృదయమున్నవాడు 
భక్తులను ఆదరించుచున్నవాడు 
సుంద నామముగలిగిన వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
793)రత్నగర్భః -

రత్నమువంటి నాభిగలవాడు 
సముద్రము వలెనే గంభీరుడు 
రత్నగర్భయను నామధేయుడు 
అందమైన నాభిగలిగినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
794)సులోచనః -

అందమైన నేత్రములున్నవాడు 
పద్మాక్షుడై యుండినవాడు 
విశాలనయనములున్నవాడు 
సులోచనములు కలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
795)అర్కః -
శ్రేష్ఠులచే అర్చింపబడువాడు 
బ్రహ్మాదులు పూజించువాడు 
దేవతలలో ప్రాముఖ్యతున్నవాడు 
అర్కా నామమున్నట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు