ప్రభుత్వ బడి ;- ::త్రిపురారి పద్మ.
 (బడి బాట పాట)
----------------------
పల్లవి:::
ఇదే ఇదే ప్రభుత్వ బడి 
జీవన విలువల గుడి 
అక్షర మాలకు 
చందన సిరి
అనురాగ లతలకు 
ఇది పందిరి
         "ఇదే ఇదే"
చరణం::
శ్రద్ధ జ్ఞానం క్రమశిక్షణ నేర్పును 
చదువుతొ పాటు బాధ్యత తెలుపును 
అమ్మానాన్నల ప్రేమను పంచును 
అవ్వా తాతకు గౌరవమిచ్చును 
    "ఇది ప్రభుత్వ బడి"
చరణం:::
మార్కుల యంత్రం విద్యార్థి అనుకొని 
మరబొమ్మగ తనను తయారు చేయదు 
మనసు మనసును ఎరిగి నడుచుకొని 
మానవత్వపు ధనము పెంచును.
    "ఇది ప్రభుత్వ బడి"
చరణం::
చదివే పిల్లల స్థాయికి చేరక 
క్రుంగుబాటుతో వెనుకబాటుకు 
చేరెడి పిల్లల చేరదీయును 
భుజము తట్టుతూ చదువు నేర్పును.
"ఇది ప్రభుత్వ బడి"
చరణం::
ఆటపాటల కళలకు వేదిక 
అద్భుతమైన ప్రగతి సూచిక 
ఆనందానికి వేసిన వల్లిక 
ఆత్మీయతకు పూసిన మల్లిక 
"ఇది ప్రభుత్వ బడి"
చరణం::
బంగరు భవితకు బాటలు వేసే 
గురువుల బోధన వెలుగుతో సాగే
బడిలో చేరగ వేగమె రండి
బంగరు పిల్లలు మీరేనండి.
          "ఇదే ఇదే:


కామెంట్‌లు