డాక్టర్ వీడి రాజగోపాల్,కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణచే ఘన సన్మానం పొందుతున్న "కావ్యసుధ"
 మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కళాభారతి సిటీ కల్చరల్ సెంటర్ హాలులో శ్రీ రవీంద్రబాబు అరవా గారు రచించిన "రవికిరణాలు", *" బాలబంధు" గద్వాల్ సోమన్న గారు రచించిన *'చిలక పలుకులు', 'స్వాగతాలు' ' "జ్ఞాపకాల దొంతరలు",మరియు "కవితా సమాహారం e- పుస్తకాన్ని. డాక్టర్ వి.డి. రాజగోపాల్, కళారత్న డాక్టర్ బి.కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో  30 మంది కవులు కవయిత్రులు పాల్గొని
తమ కవితలను వినిపించారు. సభా సామ్రాట్ బిక్కి కృష్ణ కవితలను విశ్లేషించారు.
ఈ సందర్భముగా ప్రముఖ కవి ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్ శ్రీ " కావ్యసుధ "ను విశ్రాంత భూగర్భ గనుల శాఖ డైరెక్టర్  డాక్టర్ వి డి రాజగోపాల్, బిక్కి కృష్ణ, ట్యాంగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి లక్ష్మీనారాయణ , విశ్రాంత అటవీశాఖ అధికారి కృష్ణారెడ్డి గార్లు మెమొంటోతో ఘనంగా  సత్కరించారు.

కామెంట్‌లు