841)మహాన్ -
దేశకాలాదులు లేకుండువాడు
పరిమితిని అధిగమించిన వాడు
మహానుభావుడైన భగవంతుడు
కాలరాహిత్యము గలిగినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
842)అధృతః -
సర్వమూ తనే ధరించినవాడు
తనను ధరించునది లేనివాడు
తనకంటే కీర్తిలేనట్టి వాడు
తనను మించునది యుండనివాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
843)స్వధృతః -
తనకుతానే ఆధారమైనవాడు
స్వకీయమైన కీర్తియున్నవాడు
గొప్ప యోగమున్నట్టి వాడు
ధైర్యము సంతోషము గలవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
844)స్వాస్వః -
విశ్వ శ్రేయోభిలాషియైనవాడు
స్వస్థతను కలిగించగలవాడు
వేదములు వెలువరించినవాడు
విశ్వరక్షణ చేసినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
845)ప్రాగ్వంశః -
ప్రాచీనుడు అయివున్నట్టివాడు
చిరకాలముగా విలసిల్లువాడు
పురాతన వంశములోని వాడు
అనాదిగా స్థిరముగా నున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి