పసిడికొండ ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నాన్నకు అమ్మ నానమ్మ
నాన్నకు తొలిగురువైన విదుషీమణి
నాన్నకోసం తనప్రాణాలు సైతం త్యజించే త్యాగమయి
నాన్న అభివృద్ధికోసం నిరంతరం
ఆ దేవుడితో సైతం పోరాడే ధైర్యశాలి
తన సంతానాన్ని కంటికిరెప్పలా కాపాడి
కడుపులో దాచుకున్న మాతృమూర్తి
పిల్లలకు పసితనం నుండే ధర్మమార్గాన్ని
చక్కగా బోధించే ఉపాధ్యాయురాలు
మంచిమంచి కథలు, పాటలు తీయగా వినిపించి
పిల్లలను వీరులుగా,ధీరులుగా,శూరులుగా,
సత్యసంధులుగా,పరోపకారులుగా,భక్తులుగా
తయారుచేసే విజ్ఞానఖని
మాకు మా నానమ్మ జ్ఞాపకం ఒక జీవనది
నానమ్మ మాకు తెలిసిన ఒక అద్భుతం
నానమ్మ మా అనుభవాల పసిడికొండ!!
**************************************

కామెంట్‌లు