శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి పద్యములు.
---------------------------
86.
కుదురు లేనట్టి దుర్బుద్ధి కోరికలను 
మదము నడయించి లోభపు మత్సరముల 
ద్రుంచి వేయుమ తుదముట్టి తొలగి పోవ 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
87.
శిక్ష వేయగ నేనెంత చిన్న దాన 
దుష్ట బుద్దిని గానయ్య దోష మెంచ 
నిన్ను నమ్మితి మదిలోన నీల వర్ణ 
నన్ను పాలింపు మాల్యాద్రి నార సింహ!//

88.
వేదవేద్యుడ  నిన్ గొల్తు   విశ్వగోప్త!
శుద్ధ విద్యకు సాకార శోభమలర 
దివ్య కాంతులు విరజిమ్ము దేవదేవ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
89.
శుద్ధ సత్య స్వరూపివి శోభనాంగ!
తోయజాతాక్ష గొల్తు నాతోడు నీవె 
కదలి రావయ్య నాదరి కరుణ తోడ 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
90.
కమల వాసిని పతివట కరువు గలదె 
బ్రహ్మ పుత్రుడై చెలువొంద పరువుపెరిగె 
గంగ-పుత్రిక ;  నీ కెంత గౌరవంబు 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
.

కామెంట్‌లు