నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఇప్పుడు కూడా ప్రమాదం అనేది జరుగుతూనే ఉంది.మరి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఓడప్రమాదాలు సర్వ సాధారణం.నావికులు సముద్ర యానం చేసేవారు.కథలుకూడా మనం చాలా చదివాం.సముద్రతీరంలో రాళ్ళను ఢీకొట్టి తుఫాన్ సముద్రపు దొంగలు వల్ల ఓడలు నీటమునిగి చాలా మంది చనిపోయారు.ఇప్పటికీ సముద్రాల్లో ఓడలు శిధిలాలను చూడొచ్చు.అతి పురాతన ఓడమునక 4వేల ఏళ్ల క్రితం దిఎర్రసముద్రంలో సంభవించింది.ఒకేఒక్క నావికుడు బతికిబట్టకట్టాడుట.15అడుగుల ఓభూతాకారం తనని కాపాడింది అని చెప్పాడు.ఆరోజుల్లో సముద్రపు భీకర ఆకారపు జీవులు తమ పడవలు ఓడల్ని నాశనంచేసేవని జనం నమ్మేవారు.1900 లో గ్రీక్ ద్వీపం తీరంలో యాంటికైథెరా ప్రాంతం లో విరిగి శిధిలమైన ఓడను చూశారు.సముద్రంలోపలికి ఓసాహసి వెళ్లి అక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్న చాలా మంది మహిళల మృతకళేబరాలు పడి ఉన్నాయి అని చెప్పాడు.కానీ అవన్నీ ఇత్తడి విగ్రహాలు.సముద్రపు నీటికి ఆకుపచ్చ రంగులో మారాయి అవి.అలాగే రకరకాల యంత్రాలు శిధిలాలను చూశారు పరిశోధన చేసిన వారు.గడియారాన్ని పోలిన సూర్యచంద్రుల చలనాలకి సంబంధించిన కంప్యూటర్ లాంటి యంత్రం కూడా వారికి దొరికింది.బహుశ ఆఓడ 2100 ఏళ్ల క్రితం నిర్మించినది అని రోమన్ వ్యాపారులు గ్రీకు విగ్రహాలతో పయనించారని భావిస్తున్నారు.అవి దొంగిలించిన లేక కొన్న విగ్రహాలు అని ఇటలీ చేరలేక ఆఓడ సముద్రం లో మునిగి పోయి ఉండవచ్చు అని పరిశోధకులు తెలిపారు 🌷

కామెంట్‌లు