వ్యర్ధకవనాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అర్ధంపర్ధంలేని కవితలు
వ్యర్ధం
ఉపమానరూపకాలులేని కైతలు
అందవిహీనం

ఇంపుసొంపులేని కయితలు
కంపుతోసమానం
పొంకపరిమళాలులేని కవనసుమాలు
త్యజనీయం

అందచందాలుచూపని అక్షరకూర్పులు
విమర్శనాత్మకం
శ్రావ్యతసున్నితత్వంలేని రచనలు
అశుద్ధం

అవాకులుచవాకులున్న కవులరాతలు
అనర్ధదాయకం
ఎక్కువపదాలువాడి తక్కువభావంతెలిపే కవిత్వము
చెత్తతోసమానం

అసందర్భ అనవసపదాలున్న కవులకల్పనలు
నిందాత్మకం
చివర చమకులేని కవితము
అనాదరణీయం


కామెంట్‌లు