చిన్నారుల పలుకులు
చూడ చిలుక పలుకులు
వెన్నెలై కురిస్తాయి
వెన్నలా ఉంటాయి
తీయ తీయని మాటలు
జీవజలపు ఊటలు
వీనులవిందు చేయును
హృదయాలు దోచును
బలే బలే పలుకులు
బంగారు పలుకులు
అమృతమ్ము సమములు
వికసించిన సుమములు
తేనెలా ద్రవించును
అధరాలు జుర్రుకొనును
ఆహ్లాదమిచ్చును
ఆనందము పంచును
నిండుగా నింపును
కన్నవారి కడుపులు
పరవశింపజేయును
విన్నవారి తనువులు
పలుకులేమో శ్రేష్టము
అందరికీ ఇష్టము
భగవంతుని బహుమతులు
పసి పిల్లలు భాగ్యము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి