తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ
 "తాతా! బడి తెరిచే రోజులు దగ్గర పడ్డాయి.ఇప్పుడేమో వర్షాలు! చిరాకు" విసుగ్గా మొహంపెట్టి అన్నాడు శివా." అలా అంటే ఎలారా? సరే పేపర్లు చదివి నీవు రాసిన విశేషాలు చెప్పు" అనగానే తన నోట్స్ తెరిచి" అపురూప వ్యక్తులు" అన్న శీర్షికతో తాను రాసిన వారిగురించి చదవసాగాడు "9ఏళ్ల ప్రీషా చక్రవర్తి ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థిగా మన్ననలందింది.90దేశాలకి చెందిన 16వేలపైగా విద్యార్థులలో ఆమె మేథావంతురాలిగా గుర్తింపు పొందింది.కాలిఫోర్నియాలోనివార్మ్ స్ప్రింగ్ ఎలిమెంటరీ స్కూల్లో చదివే ఈపాప 2023లో అమెరికా లోనిజాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ పరీక్ష లో రకరకాల పరీక్షలలోఅసాధారణ ప్రతిభ చాటింది.ప్రతిఏడూ30శాతం కన్నా తక్కువ మంది అర్హత సాధిస్తారు. ఫేమస్ మెన్స్ ఫౌండేషన్ లో జీవితాంతం సభ్యత్వం పొందింది చిన్నారి.ట్రావెలింగ్ మార్షల్ ఆర్ట్స్ ఈమెకు చాలా ఇష్టం."
ఇక మనదేశంలో కూడా అమ్మ నాన్నలు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు.  పిల్లల కి పుస్తక పఠనం పై ఆసక్తి పెంచటానికి పూణె కార్పొరేషన్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం లో 3066మంది పిల్లల అమ్మా నాన్నలు పాల్గొన్నారు.తమ పిల్లలకి కథలు చదివి వినిపించారు.పూర్వం ఇంట్లో తాత అవ్వ  ఉండేవారు కాబట్టి పిల్లలకి ఒంటరితనం ఉండేది కాదు.నేడు పుస్తకాలు చదువు పేరు తో ఎవరికి వారే యమునా తీరే ఐనారు.రేడియో పిల్లల ప్రోగ్రాం కి తీసుకొని వెళ్ళేవారేలేరు.పాట కథ శ్లోకం చెప్పకుండా చదువు పేరుతో పిల్లల్ని బడి ట్యూషన్ లో కూలేస్తున్నారు. ఇక టి.వి.స్మార్ట్ ఫోన్ తో ఒంటరిగా ఉన్న పిల్లలు పెద్దలు ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొంటే బంధాలు అనుబంధాలు గట్టి పడతాయి కదూ?" శివా రాసిన విషయాలు విని తాత శభాష్ అన్నాడు.బడిలో ప్రతి శనివారం మధ్యాహ్నం పూట ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది కదూ🌹

కామెంట్‌లు