క్లోజప్ లో చీమ!;- - యామిజాల జగదీశ్
 ఇక్కడి ఫోటో చూడగానే అదేదో భీకర జంతువుదని అనుకుంటే ముమ్మాటికీ పొరపాటే. చూడగానే అలా అన్పిస్తుంది కానీ అది చీమ. మన ఇళ్ళల్లోనూ తోటల్లోనూ కనిపించే చీమే అది. అయితే చీమల క్లోజప్ ఫోటోలను తీసి బహుమతి పాందిన  యూజెనిజస్ కవలియాస్కాస్ ఈనాడు ప్రముఖ ఫోటోగ్రాఫరుగా ప్రసిద్ధికెక్కారు. రెండేళ్ళ క్రితం అతను 2022 నికాన్ స్మాల్ వరల్డ్ ఫోటోమైక్రోగ్రఫీ కాంపిటీషన్‌లో ఈ చీమ ఫోటోతో అందరి దృష్టినీ ఆకట్టుకుని సెభాష్ అనిపించుకున్నాడు. చీమను క్లోజప్ షాట్ లో క్లిక్కుమనిపించాడు. దానిని  మైక్రోస్కోప్‌లో ఐదు రెట్లు పెంచి ఔరా అనిపించుకున్నాడు.
యూజెనిజస్ కవలియాస్కాస్ (Eugenijus Kavaliauskas) లిథువేనియా జాతీయుడు. అతను ఫోటోగ్రఫీలో ఇప్పటివరకు సాధించిన విజయాలు :
2007 లిథువేనియన్ ప్రెస్ ఫోటో పోటీలో రెండు బహుమతులు,  2008లో లిథువేనియన్ ప్రెస్ ఫోటో కాంటెస్టులో ఓ పక్షి ఫోటోకి గోల్డెన్ అవార్డు, 2010 మాస్కోలో  అంతర్జాతీయ పోటీలో పాల్గొని "గోల్డెన్ టర్టిల్" - "బెస్ట్ బర్డ్ పోర్ట్రెయిట్" విభాగంలో విజేతగా అవార్డు ఇలా ఎన్నో బహుమతులు గెల్చుకున్నాడు. మొదట్లో అనేక రకాల పక్షులకు ఫోటోలు తీసి అవార్డులూ రివార్డులూ అందుకున్న ఇతను అనంతరం కీటకాలకు ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. కీటకాలకు ఫోటోలు తీయడం సవాల్ అని అంటాడితడు. కీటకాలకు ఫోటోలు తీసి  జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు పొందాడు 



కామెంట్‌లు