కంటిచూపు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కంటిచూపు
చెబుతుంది
ఏదోలోపం
వచ్చిందని
అందాలు
కనబడటంలేదని
ఆనందాలు
కలగటంలేదని

కళ్ళు
ఏడుస్తున్నాయి
కన్నీరు
కారుస్తున్నాయి
చూపు
తగ్గిందని
వయసు
పెరిగిందని

కనులు
నిప్పులుక్రక్కుతున్నాయి
మంటలు
ఎగిసిపడుతున్నాయి
అక్రమాలనుచూచి
అన్యాయాలనుకాంచి
అత్యాచారాలనువీక్షించి
అబద్ధాకోరులమాటలువిని

మూడోకన్ను
తెరవాలనిపిస్తుంది
ముష్కరులను
మసిచేయాలనిపిస్తుంది
సమాజాన్ని
రక్షించాలనిపిస్తుంది
అణగారినవారికి
అండగానిలవాలనిపిస్తుంది

సాహితి
విచారిస్తుంది
సరస్వతి
శోకిస్తుంది
కవనప్రియుడు
కలంపట్టటంలేదని
ప్రియపుత్రుడు
పుటలునింపటంలేదని

వైద్యులు
కంటిచికిత్సచేశారు
కాంటాక్టులెన్సు
అమర్చారు
తలొగ్గకతప్పలేదు
అద్దాలకంగీకరించాను
సర్జరీజరిగింది
పక్షంరోజులవిరామంతీసుకుంటున్నాను

భార్య
కలాలుదాస్తుంది
కూతురు
కాపలాకాస్తుంది
ఆలోచనలు
వెంటబడుతున్నాయి
భావాలు
పరుగులెత్తమంటున్నాయి

ఎదురుచూచే
పాఠకుకులకు ధన్యవాదాలు
విమర్శించే
విఙ్ఞులకు విన్నపాలు 
ఓదార్చే
స్నేహితులకు కృతఙ్ఞతలు


కామెంట్‌లు