'శంభో!'శతకపద్యములు
కందములు
16.
కాశీ పురాధి వాసా!
యీశా ! క్లేశహర! దేవ! హృదిలో నిన్నే
నాశగ నిల్పితి నయ్యా!
పాశుపతవిధిని గొలిచెద భక్తిగ శంభో//
17.
అభిషేకము జేసెద నా
కభయము నీయవె శుభకర !యభిమానముగా
నిభచర్మాంబరధర !నిను
విభుడని నమ్మితి మనమున వినుమా శంభో !//
18.
పున్నమి వేళల నీదరి
జెన్నుగ చేరితి ముదముగ జిరయశ మొందన్
పన్నగ భూషణ !నిను గని
పున్నెము నాదని మురిసితి బురహర శంభో !//
19.
పరతత్త్వము నెఱిగితి నే
తిరముగ నీపద కమలము దెరువని గంటిన్
గరుణాలయ !విడువక నీ
పరిచర్యలు జేసి గొల్తు భక్తిగ శంభో !//
20.
ధర్మము తెలియక పాపపు
కర్మలు జేసితి బశుపతి !గర్వము తోడన్
మర్మము నెరిగితి నయ్యా !
నిర్మల మైన హృది నిడుమ నిరతము శంభో !//
కందములు
16.
కాశీ పురాధి వాసా!
యీశా ! క్లేశహర! దేవ! హృదిలో నిన్నే
నాశగ నిల్పితి నయ్యా!
పాశుపతవిధిని గొలిచెద భక్తిగ శంభో//
17.
అభిషేకము జేసెద నా
కభయము నీయవె శుభకర !యభిమానముగా
నిభచర్మాంబరధర !నిను
విభుడని నమ్మితి మనమున వినుమా శంభో !//
18.
పున్నమి వేళల నీదరి
జెన్నుగ చేరితి ముదముగ జిరయశ మొందన్
పన్నగ భూషణ !నిను గని
పున్నెము నాదని మురిసితి బురహర శంభో !//
19.
పరతత్త్వము నెఱిగితి నే
తిరముగ నీపద కమలము దెరువని గంటిన్
గరుణాలయ !విడువక నీ
పరిచర్యలు జేసి గొల్తు భక్తిగ శంభో !//
20.
ధర్మము తెలియక పాపపు
కర్మలు జేసితి బశుపతి !గర్వము తోడన్
మర్మము నెరిగితి నయ్యా !
నిర్మల మైన హృది నిడుమ నిరతము శంభో !//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి