..నీ వినాశనానికి నీవే హేతువు;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్:-విశాఖపట్నం
 (పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా)
.==========================================.............................
ప్రసవవేదన పడి
పునర్జన్మ నెత్తి
పెంచి పెద్దచేసిన
మాతృమూర్తిని
ఎలాగు   చూడనిమనిషీ
కన్నతల్లి కన్న మిన్నయిన
పుడమి తల్లి కడుపు పొరలను
స్వార్ధ ప్రయోజలాలకై చీల్చి
నీవు వదిలే విష వాయువును స్వీకరించి
నీ మనుగడకాధారమైన
ప్రాణవాయువు నందించే
పచ్చనిచెట్లను మొదలంట నరికి
బహుళ అంతస్తుల భవనాలను 
వాయు కాలుష్యాన్ని ఇచ్చే రసాయన పరిశ్రమలను నెలకొల్పి
భయంకరమైన కాన్సర్ వ్యాధిని కలిగించే ప్లాస్టిక్ పదార్థాలను భూమిపై, నీటిలో వేసి
ఒకరితో ఒకరు పోటీపడి అనవసర శాస్త్ర ప్రయోగాలతో
రక్షణ కవచమైన ఓజోన్ పొరను ఛిద్రం చేసి
అతినీలలోహిత కిరణాలబారిన జీవరాశి పడుటకు కారణభూతుడవై
"అధిక ఉష్ణోగ్రతలతో భూతాపాలకు", సునామీలకు కారణమైన
ఓ మనిషి నీ వినాశనానికి నీవే హేతువన్నది తెలుసుకో.
"వృక్షో రక్షతి రక్షితః "అన్న
చిప్కో ఉద్యమ కారులైన
బహుగుణ, మేథాపాట్కర్ వంటి పర్యావరణ పరిరక్షకుల
అడుగుజాడల్లో నడచి
భూతాపాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణ చేద్దాం
వసుదైకానికే ఆదర్శంగా నిలుద్దాం...!!
.......................... 

కామెంట్‌లు