కోరాడ హై కూ లు :-" మౌనం "

 ముని యై నాడు
  ఋషిగా మారి నాడు
       మౌనమహత్యం
    *******
అర్ధా0గీ కారం
 బదులు పలుకక
   మౌనము తోనే
   *******
తిట్టి, కొట్టిన
  తిరగ బడ డేమి
    మౌన వ్ర త ము
    *****
వాదు లాడడు 
  బదులు పలుకడు
     వాడే గెలిచె
   ******
మాటాడ కనే
   ముచ్చట్లన్ని తెలిసె
      మౌనమూ భాషె
     ******
  కోరాడ నరసింహా రావు!
కామెంట్‌లు