అలసిపోయిన!!?;- Dr.ప్రతాప్ కౌటిళ్యా
నిరంతరం కురిసి కురిసి
అలసిపోయి ఆగిపోయిన
ఒక మేఘం నేను!!!

పూలు పూసి పూసి
కాయలు కాసి కాసి
అలిసిపోయి ఎండిపోయిన
ఒక తీగను నేను!!!

భూమంతా పారి పారి
అలసిపోయి తడారి పోయిన
ఒక నదిని నేను!!!!

మాట్లాడి మాట్లాడి
అలసిపోయి మౌనంగా మారి
మూగబోయిన ఒక గొంతును నేను.!!!

ఎదురుచూసి చూసి
అలిసి
చూపే చెదిరిపోయిన
ఒక దృశ్యం నేను!!!!

ఒకే వైపు నడిచి నడిచి
అలిసి
నడకే ఆగిపోయిన
ఒక గమ్యం నేను!!!

వేల ఇంద్రధనస్సులు విరిసీ
ఎన్నో ఉరుములు ఉరిమి
ఎన్నో మెరుపులు మెరిసి
అలిసిపోయిన ఒక ఆకాశం నేను!!!?

బాల్య స్నేహితురాలు సువర్ణకు అంకితం.

డా.ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు