25ఏళ్ల ఆమె మహారాష్ట్ర లో పబ్లిక్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించింది.టైపిస్ట్ గా సెక్రటేరియట్ లో జాబ్ లో చేరింది.ఆ..అని చప్పరించేయకండి! చెత్త కుండీలో పుట్టిన అంధపసిబాలికని రిమాండ్ హోం లో చేర్చారు.పద్మశ్రీ శంకర్ బాబా పాపల్కర్ ఆపాపకి మాలా పాపల్కర్ అని పేరు పెట్టారు.పి.జి.విదర్భ యూనివర్సిటీ లో చేసిన మాల కోరిక ఐ.ఎ.ఎస్.కావాలని! ఇలాంటి శంకర్ బాబా లు కావాలి మనకు.
అమ్మ పాలు పుట్టిన శిశువు కి బలం జీవం జవం.చాలామంది తల్లులకు పాలు పడక పోతపాలతో పెంచుతున్నారు.రక్ష జైన్ అనే మాతృమూర్తి తన కన్నబిడ్డకి పాలు ఇవ్వలేక తనవద్ద లేక మానసిక వేదనపడింది.మిల్క్ బ్యాంకు లోంచి పాలు తెప్పించి తన బాబుని పెంచింది.రాజస్థాన్ కి చెందిన ఈమెకు ప్రసవం తర్వాత మూడోరోజు పాలు చేపుకురావడంతో తన దగ్గర మిగిలిన పాలను దానంగా ఇవ్వడం జరిగింది.2018_19 మధ్65 లీటర్ల తల్లి పాలు ఇచ్చిన ఆమె రెండో సారి కాన్పు తర్వాత 106 లీటర్ల పాలివ్వడం గ్రేట్! 5వేలమంది పసివారి ప్రాణాలకు రక్షగా మారింది రక్షజైన్!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి