స్ఫూర్తి దాతలు _2 అచ్యుతుని రాజ్యశ్రీ

 నేడు మనం కాస్త దెబ్బ తగిలి తే చాలు విలవిలలాడతాం.ఏదో ఐపోయిందని బతుకు వ్యర్థం అని భావిస్తాం.కానీ అర్పితారాయ్ కథవింటే నోరు వెళ్లబెడతాం.కలకత్తా కి చెందిన ఈమెను బైక్ గుద్దడంతో రోడ్డు పై పడిపోయింది. సరిగ్గా ఓలారీ ఆమె కాళ్ళ పై దూసుకు పోవటం రెండు కాళ్ళను మోకాలిదాకా తీసేయడం తో నిరాశతో ఆమె కృంగిపోయింది.కృత్రిమ కాళ్ళతో యోగాసనాలు నేర్చుకుని నేడుయోగా టీచర్ గా దేశవిదేశాల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలో ఫుల్ టైం జాబ్తో పాటు సి.ఆర్.పి.ఎఫ్.పోలీసులకు వర్క్ షాప్ నిర్వహించారు. మోటివేషన్ ఉపన్యాసాల తో చిన్నారులు దివ్యాంగులకు స్ఫూర్తి దాత గా ఉన్నారు. 
ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కైఆదివాసీ మహిళ చేసే కృషి అద్భుతం.అమెజాన్ ఆదివాసి మహిళ     జాన్ ఫ్రంట్ లైన్స్ అండ్ సిబో ఎలయన్స్ పేరు తో 5 లక్షల ఎకరాల  అడవిని కార్పొరేట్ కంపెనీల నుండి కాపాడింది.1950 లో యూరోపియన్ మిషనరీలరాకతో మాబతుకులు నాశనం ఐనాయి .  ఆరోగ్యం కోసం రోగ నివారణకు చెట్టు కొట్టేముందు పాటపాడి క్షమాపణ వేడే ఆదివాసీల వారసులుగా నీమోంటే నెన్క్విమో ఆదర్శంగా మనం ఉన్న చెట్ల ను కాపాడాలి.వాకిలి ముందు చెట్టు పాతాలి. తమప్రాంతం భూమిపొరల్లో ఉన్న  చమురు ని తమ పూర్వీకుల రక్తంఅని భావించే దొడ్డబుద్ది ఆమెది🌹
కామెంట్‌లు