ఇంజనీర్ రత్నలక్ష్మికి కొలకలూరి ఇనాక్ జాతీయ పురస్కారం - 2024

 నంద్యాల జలవనరుల శాఖలోని తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న ఎస్. రత్నలక్ష్మికి విశిష్టమైన కొలకలూరి ఇనాక్ జాతీయ పురస్కారం - 2024 లభించింది. ఆమె ప్రవృత్తి రీత్యా తెలుగుభాషపై మక్కువతో సాహిత్యంలో పలు ప్రక్రియలలో వేలకొలదీ కవితలు విరచించి, పలు అవార్డులను, రివార్డులను కైవసం చేసుకున్నది. 
ఈ సందర్భంగా ఈనెల 1/7/2024 న హైదరాబాదులోని తాజ్ హోటల్ లో వాల్మీకి సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ మరియు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గురుదేవోభవ అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనంలో రత్నలక్ష్మి గురువులకు వందనం అనే కవితను పఠించి కొలకలూరి ఇనాక్ గారి ప్రశంసలను సైతం పొందింది.
ఈ సందర్భంగా వాల్మీకి సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ వ్యవస్థాపకులైన వి డి రాజగోపాల్, ప్రసిద్ధకవి & రచయితయైన బిక్కి కృష్ణ మరియు కృష్ణారెడ్డి మొదలైన వారు కొలకలూరి ఇనాక్ జాతీయ పురస్కారం - 2024తో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారే స్వయంగా స్వహస్తాలతో రత్నలక్ష్మిని సన్మానించి అందమైన దుస్సాలువ మరియు సుందరమైన జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, కవిశ్రేష్టులు, పుర ప్రముఖులు, సహ రచయితలు రత్నలక్ష్మిని ప్రశంసిస్తూ అభినందనలతో ముంచెత్తారు.
కామెంట్‌లు