మేము ఏ గడ్డైన కరుస్తం;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం9640748497
మేముఅవసరానికి
ఏగడ్డైన కరుస్తం
మంచి మానవత్వం
మాకు ఏ కోశానా లేవు
స్వార్థాన్ని అణువణువునా
నింపుతున్న వాళ్ళం

మావన్నీ మనీ బంధాలే
తోబుట్టువులు స్నేహితులు
ఎవరినైనా మేము
అవసరానికే వాడుకుంటాం
అవసరం తీరాక
అనామకుడిగా చూస్తాం

మేమెప్పుడూ ఎక్కే మెట్ల గురించే ఆలోచిస్తాం!
దిగే మెట్ల ప్రస్థావన
మాఊహాకు
కూడా రానే రాదు 

ఎందుకంటే 
మాకు మిత్రులెవ్వరూ ఉండరు
మాకు శత్రువులే అంతా

మాకు ఇరవై నాలుగ్గంటలైనా
రికాంలేదు
మీరు అవధానం తో వింటే
మాగుండెకాయకూడా
లబ్ డబ్  అనడంఎప్పుడో మరిచిపోయింది.
డబ్బు డబ్బు అని అనుక్షణం
కొట్టుకుంటుంది.

అసమర్థులే  మాతో అంటుంటారు 
రేపు మీరు చస్తే ఈడబ్బు  నీవెంటరాదుగదా!
అని
డబ్బు సంపాదించడం 
మాకో వ్యసనం 
మోసపోవడం అసమర్థుల
తెలివితక్కువతనం,
అది వారి బలహీనత 

మేము వస్తు ప్రేమలకుఅలవాటుపడ్డవాళ్ళం
తిన్నది కక్కినది అంతా లెక్కలేసేటోళ్ళం
మేము పడుకున్న నిద్ర మేల్కొన్న
డబ్బునే కలగంటం!
డబ్బునే పలవరిస్తం!!
డబ్బునే కలవరిస్తం!!!

మేము డబ్బు మనుషులం
మేము డబ్బే సర్వస్వమని
తలంచేవాళ్ళం
"ధనం మూలం ఇదం జగత్"
అనే సూక్తిని నిత్యం పారాయణంచేస్తున్నవాళ్ళం

(ఇది డబ్బు మనుషుల ,స్వార్థపరుల
మెట్ట వేదాంతం )


కామెంట్‌లు