శ్రీ విష్ణు సహస్రనామాలు ;- (బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
976) యజ్ఞకృత్ -

యాగములు నిర్వహించినవాడు 
యజ్ఞకర్తగా నడిపించెడివాడు 
కృత్యములు జరిపించుచున్నవాడు 
యజ్ఞకృత్ నామమున్నట్టి వాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
977)యజ్ఞభృత్ -

యజ్ఞములను రక్షణచేయువాడు 
యాగపోషణము చేయువాడు
యజ్ఞ భృత్ పేరున్నట్టివాడు 
యాగపోషణము చేయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
978)యజ్గ్ని-

ప్రధాన ఆరాధనామూర్తి ఐనవాడు 
ఆహ్వానం అందుకొనినట్టివాడు 
యజ్ఞసామర్ధ్యము గలిగినవాడు 
యజ్ఞపతిగా భాసించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
979)యజ్ఞభుక్ -

ఫలములు అనుభవించువాడు 
హవిస్సులు స్వీకరణచేయువాడు 
యజ్ఞభుక్కుగా నుండినవాడు 
భోక్తవలే అనుసరించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
980)యజ్ఞసాధనః -

యాగసాధనముగా యుండినవాడు 
తనను పొందు మార్గమైనవాడు 
యజ్ఞఫలిత సాధనమైనవాడు 
ఫలమిచ్చునట్టి భగవంతుడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!

(సశేషము )

కామెంట్‌లు