బుద్ధిని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 సమ్యక్ సంబుద్ధుడను మలినాలను కడిగేసుకుని దుఃఖ భాజకమైన ఉపాధులను జయించాను అందుకనే నన్ను జినుడు అంటారు  ధర్మచక్ర ప్రవర్తన కోసం రిషి పట్టణం వెడుతున్నాను అజ్ఞానాంధకారం లో మగ్గుతున్న ఈ లోకం పై చావులేనటువంటి జ్ఞాన కిరణాలను వెదజల్లుతాను అని చెప్పి వారణాసి ప్రయాణం కట్టాడు బుద్ధుడు వారణాసిలోని రుషి పట్టణం చేరుకుంటూ ఉండగా దూరం నుంచి చూసిన ఐదుగురు   శ్రమణులు  జ్ఞాన సముపార్చన సమరంలో అతడు యతి నియమాలను  విడనాడి నందున ఆయనకు ఎలాంటి మర్యాదలు చేయరాదు అనుకున్నారు అసమానమైన దేహ కాంతితో ఉన్నతమైన ధర్మాన్ని గ్రహించిన బుద్ధుడు వారికి దగ్గరగా వస్తున్న కొద్దీ ఆయనను వారి అంతట వారే గౌరవించాడు.అప్పుడు వారు ఆయన పేరుతో పిలిచారు అప్పుడు బుద్ధుడు ఓ భిక్షువులారా తథాగతుని పేరుతో గానీ అవుపో అని కానీ సంబోధించరాదు పూర్తిగా సంబోధిని సంతరించుకున్న ఉన్నతుడైన తథా గతుని సందేశం వినండి తక్కువ సమయంలోనే ప్రజ్ఞావంతులవుతారు అని చెప్పాడు అప్పుడు ఆ ఐదుగురు కఠోర నియమాలతో చేసిన ధ్యానాన్ని వదిలి విలాస జీవితానికి అలవాటు పడిన నీవు విశిష్ట జ్ఞానాన్ని ఎలా పొందావు అని బుద్ధుడుని అడిగారు ప్రయత్నాన్ని మారలేదు ఎన్నడూ ఎలాస జీవితాన్ని గడపలేదు నాకు పరిపూర్ణమైన జ్ఞానం ప్రజ్ఞ కలిగాయి నాకు సంబోధి ప్రాప్తించింది నా ఉపదేశాన్ని విని పవిత్ర జీవిత లక్ష్యాన్ని చేరుకోండి అని బుద్ధుడు అన్నాడు  అయినా ఆయన మాటల్లో ఆ ఐదుగురు  శ్రమణుల కు నమ్మకం కుదరలేదు.బుద్ధుడు తనకు సంబోధి కలిగింది అని మూడుసార్లు చెప్పిన తర్వాత బుద్ధుని పట్ల నమ్మకం కలిగి ఆయన ప్రవచనం వినడానికి సిద్ధమయ్యారు రోజు ఐదుగురు భిక్షువులలో ముగ్గురు దీక్షకు వెళ్ళగా మిగిలిన ఇద్దరూ బుద్ధుడు తాను కనుగొన్న ధర్మాన్ని బోధించాడు తర్వాత ఇద్దరు భిక్షువు లలో ఇద్దరు భిక్షకు పోగా మిగిలిన ముగ్గురికి ధర్మబోధ గావించాడు  భగవానుడు వారణాసిలోని ఋషి పట్టణంలో కల మురగదా వనంలో విహరిస్తున్నప్పుడు అక్కడున్న (పంచవర్గీయ ఇంతకుముందు చెప్పిన ఐదుగురు) భిక్షువులతో భగవానుడు ఇలా అన్నాడు రెండు అంశాలను  ఆచరించరాదు  ఆ రెండు అంశాలు ఏమిటి అంటారు  ఒక అంశం కామం శారీరక సుఖాల్లో ఆసక్తులై ఉండడం అలా కామ సుఖాల్లో ఆసక్తుడైన వారు అజ్ఞానులు మూర్ఖులు బయటపడడం తెలియని మామూలు   జనులు.
=================================
సమన్వయం ; డా . నీలం స్వాతి 

కామెంట్‌లు