నాదు జన్మ భూమి కంటే నాకమెక్కడున్నదీ? సురలోకమెక్కడున్నదీ? అన్న కవి గేయం నిత్య సత్యం.కేరళ లోని తిరువరుప్పులో కృష్ణ మందిరం కథ అద్భుతం.
పౌరాణిక గాథప్రకారం పాండవులు వనవాసం లో కృష్ణుని విగ్రహాన్ని తయారు చేసి పూజతర్వాత నైవేద్యం పెట్టే వారు.వారితో పాటు చేపలుపట్టేవారుకూడా పూజలో పాల్గొనేవారు. వనవాసం ముగిశాక వారికే కృష్ణ విగ్రహాన్ని వదిలి పాండవులు వెళ్లి పోయారు. వారికి కష్టాలు చుట్టుముట్టడంతో ఓసాధువు బోధతో బెస్తలు ఆవిగ్రహంని అక్కడే వదిలివెళ్లిపోయారు.విల్వమంగళం స్వామియార్ అనే సాధువు కి ఆవిగ్రహం దొరికింది. అదీ నీటిలో ఆయన నావకు అడ్డుగా వచ్చింది. దాన్ని ఆయన నీటి లోంచి బైట కి తీసి చెట్టుకింద ఉంచారు. దాన్ని మళ్ళీ ఎత్తాలని ప్రయత్నం చేసి విఫలుడై అక్కడే స్థాపించారు. కంసుని వధించాక కృష్ణుడికి విపరీతంగా ఆకలేయసాగింది.అందుకే ఆవిగ్రహం ముందు ఇప్పటికీ ఉంచే ప్రసాదం కొంచెం కొంచెం గా మాయం అవుతుంది. గ్రహణకాలంలో అన్ని ఆలయాల్లో లాగా నే దీన్నికూడా మూసేశారు.ప్రసాదం పెట్టలేదు. మర్నాడు
ఆలయతలుపులు తెరిస్తే విగ్రహం నీరసంగా బక్కచిక్కినట్లుగా కన్పించింది. పైగా నడుంకి బిగించి కట్టిన దట్టి వదులుగా క్రిందకి జారింది
ఆవిషయం ఆదిశంకరాచార్యులవారికి తెలిసింది. ఆయన ఆదేశంతో
గ్రహణకాలంలో గూడా ఆలయం ని మూసివేయరు. అప్పటినుంచి రోజు కి10 సార్లు నైవేద్యం ఇవ్వడం ఆచారం గా ఉంది. ఇప్పుడు ఆవిగ్రహం నిండుగా కళకళలాడుతూ భక్తుల కోరికలు తీరుస్తోంది 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి