వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 ఒక ప్రక్క చదువుతూనే మరో ప్రక్క  తల్లికి సహకరిస్తూ చేదోడు వాదోడుగా మాటలతో కడుపు నింపుతూ  ముచ్చటగా తిరిగే  ఆయవ్వనవతిని చూసి  ఎంత మురిసిపోతుందో  ఆ తల్లి  ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ భర్తకు  తెలియజేస్తూ  అమాయకంగా చెప్పే భార్యను చూసి ఆ భర్త  తనకన్నా తాను ఎంత  మదన పడుతున్నాడో తనకే తెలుసు కన్న మనసుతో  పైకి చిరునవ్వు నటిస్తూ  భార్య మాటలకు మురిసిపోవడం ప్రతి ఇంటిలోనూ చూస్తూనే   ఉంటాం  ఎప్పుడు వియ్యాల వారి ఇంటికి వెళ్లి ఆ బంగారు తల్లిని చూద్దామా అన్న ఆరాటంలో  ఆ విషయం భార్యకి చెపితే  ప్రతిసారి మనo వెళితే వారు ఏమనుకుంటారో  అన్న అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు  ఆ తల్లి ఎంత అసంతృప్తికి లోనవుతుందో  ఆలోచించగలమా  ఇదే ప్రకృతి.అత్తవారి ఇంటిలో  అడుగు పెట్టడానికి ముందే  బజారు  గుమ్మం దాటకుండానే  పుట్టింటి గుర్తులన్నీ పక్కనపెట్టి  కుడికాలు లోపల పెట్టి ప్రవేశించిన  ఆ నూతన వధువుకు  ఆలోచనలు ఎలా ఉంటాయి  ముందు తన భర్త గురించి  ఎలాంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడు  నేను ఎలా ప్రవర్తిస్తే ఆయనకు నచ్చుతుంది  ఏమైనా పొరపాటుగా అనడానికి మాట ఏదైనా అన్నప్పుడు   హాస్యనికైనా ఆయన వెంట నడుచుకుంటాడా ఆయన తత్వం ఏమిటి  అత్తమామలు నన్ను అమ్మానాన్నలాగా చూడగలరా  ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వారి వారి వరసలు ఏమిటో  ఈ ఇంటికి వచ్చే ప్రతి కొత్త వ్యక్తి తనకు  ముఖ పరిచయమే లేనప్పుడు వారితో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి  అన్న ఆలోచనలతో సతమతమౌతుంది.
ఇంటిదగ్గర కన్న తండ్రి తో  ఎంతో గారాబంగా తనకు కావలసిన పనులన్నీ చేయించుకోవడం  బుంగమూతి తో  అమ్మ దగ్గర వేషాలు వేసి తనకు కావలసిన పనులు చేసుకోవడం  ఇక్కడ కుదురుతుందా  నా ఇష్టం వచ్చిన స్నేహితురాండ్రను ఇంటికి పిలిచి మాట్లాడుకొనే అవకాశం ఇక్కడ ఉంటుందా  అమ్మను నాన్నను చూడాలని బెంగపడినప్పుడు  పుట్టింటికి వెళ్ళి  రావడానికి ఎవరి అనుమతి కావాలి భర్తదా  అత్తదా మరదలు ఏవైనా హాస్యక్తులు మాట్లాడితే  సమాధానంగా తను  ఏది మాట్లాడితే ఏమవుతుందో అన్న భయం    తనకు కొత్త వారైనా ఆ ఇంటి పాత  బంధువులు వస్తే వారిని ఎలా ఆహ్వానించాలి ఎలా చేయాలి అసలు వారి పేర్లైనా ఎలా తెలుసుకోవాలి  ఇవన్నీ ఆలోచిస్తూ బుర్రవేడెక్కిపోతుంది.
=====================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు