స్వాతంత్ర్యదినోత్సవం.. గంగరాజు పద్మజ మలకపేట హైదరాబాద్

 స్వాతంత్ర్యదినోత్సవ మిది
వజ్రోత్సవాల అనంతరం 
నవాభ్యుదయానికి నాంది 
నవోత్సాహంతో నవతరం
ఆరంభం శూరత్వం గాక
బాధ్యత గురుతరం
సాగాలి ప్రగతి పయనం నిరంతరం 
మేథా దీప్తి వెలగాలి ఖండఖండాలు దాటి
ఘనమైన జనశక్తి సాధించగల విజయాలు  మహత్తరం
సర్వతోముఖ వికాసం తో 
జీవనం రసవత్తరం 
ఎగరవలె త్రివర్ణ కేతనం
భారతీయులకు స్ఫూర్తి కలుగవలె యుగాంతరం🌷
కామెంట్‌లు