:నటన నవరసం. జీవనం ఆదర్శం.;- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.




 పంచపది,
=======
నా పంచపదుల సంఖ్య---
1470.
అక్కనేని నటనల గని, తవ్వడమే మన పని! 
తవ్విన కొద్దీ తెలుస్తుంది,
 తరగనవి అవి అని!
ఆ కళ్ళు చెపుతాయి ,
నటన ఆయనకే సాధ్యమని! 
పాటలంటాయి లయబద్ధ, స్టెప్స్ ఆయన సొంతమని! 
వెండితెరకి సమ్రాట్టు ,
మన హృదయాల గుడికట్టు,
పివిఎల్!
1471.
మన మనసుల దొంగ ,
దొంగరాముడు, పూలరంగడు! 
నటన-సీత, రాముడై, సీతారామయ్యగా గెలిచాడు! 
మేఘసందేశం ,కట్టుబడ్డ, నాట్యకళ ఆరాధకుడు! 
సుడిగుండాలు,మరో ప్రపంచం, సమాజ ప్రక్షాళకుడు! 
పాత్ర ఏదైనా పరకాయ, ప్రవేశం విజయ రహస్యం, పివిఎల్! 
1572.
నటన కట్టుబాటు,
 పక్కదారి పట్టని జీవనము!
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, స్వీకారం కృషిఫలము! 
వ్యక్తిగత జీవన నిబద్ధత,
పాలన జీవితాంతము! 
అందాల రాముడు,
 వదనాన,మెరిసే దరహాసము!
అన్నపూర్ణ హృదయేశుడు, సినీలోక కీర్తిశేషుడు,పివిఎల్!
_________
x



 

కామెంట్‌లు