పాలనవ్వులు
తోటలో విరిసిన పువ్వులు
కన్నవాళ్ళ ప్రతిబింబాలు
రేపటి చరితకు సాక్షి భూతాలు
వస పిట్టలు వీళ్ళు
కల్లాకపటమెరుగని దైవ స్వరూపులు
కొత్త స్వరాలు ఆలపించే కోయిలలు
పురివిప్పి ఆడే నెమళ్లు
ముద్దు మురిపాల మూటలు
రేపటి తరానికి ఆశాజ్యోతులు
నింగిన వెలిగే చుక్కలు
నేలన ఎదిగే మొక్కలు
పిల్లలు ఆనందపు ఎల్లలు చెరిపిన మంచి ఆకతాయిలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి