లఘువంత మొక్కను చదువుమనిషిని చేసి
గురుస్థానంలో నిలిపిన బోధి చెట్టు
అహం తుప్పు వదిలించి సభ్యత ఋజువర్తన నేర్పే సమతాక్షర సూర్యుడు
వృత్తులేవైన సమాజాన దీపం వెలుగులు పంచే మంచిని పెంచే
జ్ఞాన హృదయం
జాతికి వెలుగుల కళలద్దిన తెల్ల కాగితం
సిరా చుక్కల తడిని తెలిపిన ఆర్తిగీతం
వ్యక్తిత్వం పోతపోసిన నల్లబల్ల అక్షరం
నా బతుకు సమరంలో వెన్నంటి నిలిచి చదువు నేర్పిన సాహసం
కన్నీళ్ళూ కడగండ్లను కడతేర్చ బడిపాఠమై బతుకుజీవిని మలిచిన మహోన్నత శక్తి గురువు
చేసె తలవంచి దండాలు
నా సప్తతి వర్ష అక్షర జీవధారంతా
వెలకట్టలేని విద్యాబుద్దుల ఖడ్గ సృష్టికి
మొక్కెద చేతుల ఎద విప్పి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి