జీవితం
పూలబాటకాదు
ఉషారుగాజోరుగా
నడవటానికి
జీవితం
హరివిల్లుకాదు
రంగులనుచూస్తూ
కాలంగడపటానికి
జీవితం
సుఖాలమయంకాదు
అనుభవించటానికి
ఆనందించటానికి
జీవితం
విహంగవీక్షణంకాదు
దూరంనుండిచూస్తూ
వినోదంపొందటానికి
జీవితం
సముద్రముకాదు
నిత్యంకెరటాల్లా
ఎగిసిపడటానికి
జీవితం
మకరందంకాదు
సీతాకోకచిలుకల్లా
క్రోలటానికి
జీవితం
వడ్డించినవిస్తరికాదు
కష్టపడకుండా
కాలక్షేపంచేయటానికి
జీవితం
భ్రమకాదు
ఊహలలో
తేలిపోటానికి
జీవితం
సంపాదనకాదు
కోట్లధనాన్ని
కూడబెట్టటానికి
జీవితం
దీర్ఘపయనం
గమ్యాలను
చేరటంకోసం
జీవితం
శ్రమించటం
లక్ష్యాలను
సాధించటం
జీవితం
ప్రేమనుపంచటం
భార్యాబిడ్డలతో
ఇరుగుపొరుగువారితో
జీవితం
నాటకరంగం
ఇచ్చినపాత్రనుపోషించి
దిగిపోవటానికి
జీవితం
గాలిపటం
ఎప్పుడు ఎగురుతుందో
ఎప్పుడు కూలుతుందో
జీవితం
విద్యాలయం
నేర్వటానికి
అమలుచేయటానికి
జీవితం
పోరాటం
బ్రతకటానికి
బాగుపడటానికి
జీవితం
ఎరుగు
ఆశయం
సాధించు
అదే
జీవితాన్నిగడపటం
అదే
జీవితాన్నిగెలవటం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి