శ్లో!
త్వమేకో లోకానాం పరమ ఫలదా దివ్యపదవీ
వహంతస్త్వన్మూలం.పునరపి భజంతే హరితమఖాః !
కియద్వా! దాక్షిణ్యం. తవశివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం. వహసి. కరుణా పూరిత
దృశా !!
భావం: శివా ! ఓ పరమాత్మా ! మూడులోకము లకునూ, మోక్ష మనె మహాఫలము లు ఇచ్ఛువాడ
వు, నీవు ఒక్కడివే కదా! నీవు అను గ్రహించి స్వర్గాది పదవులు ఇచ్చిన ఇంద్రాది దేవతలు.
కూడా అంతే కంటే ఉత్తమ ఫలములు కొరకు మరలా ,నిన్నే సేవించుచున్నారు.భక్తుల మీద.
నీకు ఎంత దయయో కదా ! శివా ! సంపూర్ణ కటాక్షము తో నా యొక్క అహంభావమును
పోగొట్టి నన్ను రక్షింపుము.
******
🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి