కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు మరో అరుదైన గౌరవం లభించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురుపూజోత్సవం సందర్భంగా, ఉత్కళ తెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో గురువే మార్గదర్శి అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన చరవాణి సమూహంలో తిరుమలరావు పాల్గొని నిరంతర విద్యార్థి అనే శీర్షికతో తన కవితను పంపి ప్రశంసలు పొందారు. ఈ మేరకు ఒడిషా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాకిమిడి కేంద్రంగా ఉత్కళ అధ్యక్షురాలు, కవయిత్రి డా.పాండ్రంగి శారద, పర్యవేక్షకులు నేరెళ్ళ మాల్యాద్రి, కవితా సమీక్షకులు సాదనాల వెంకట స్వామినాయుడు, గేదెల హేమాచలంలు తిరుమలరావు ప్రతిభను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపారు. విద్యార్ధి దర్శించని క్షేత్రాన్ని సైతం దర్శించేలా చేయగల బోధన గురువు ఘనత అంటూ, ఉపాధ్యాయుల సహనం సత్శీలత వంటి అనేక అంశాలను తిరుమలరావు తన కవితలో చాటిచెప్పారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావుకు గురుపూజోత్సవ ప్రశంసాపత్రం లభించుట పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
తిరుమలరావుకు గురుపూజోత్సవ ప్రశంసాపత్రం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి