హనుమ సముద్రంని లంఘించటం అద్భుత ఆధ్యాత్మిక సందేశం. పుణ్యం తో సుఖభోగాలు అశాశ్వతం.సదా భగవంతుని స్మరణలో రమించినవాడు హనుమ యోగి.చింతపండు వేసితోమితే పాత్రలు తళతళలాడుతాయి.కానీ చింతపండు తుక్కుని పారేస్తాం.మనలోని ఆత్మ అజ్ఞానం ని తొలగించుకోటానికి పుణ్యకర్మలు చేయాలి. ఈశ్వరార్పణమస్తు అని చింతపండు తుక్కులా అహంకారం అభిమానం ప్రాపంచిక భోగాలు తృణీకరించాలి. అలా సురస నోటి లోకెళ్లి బైట కి వచ్చి తన దారిన తాను బయలుదేరాడు హనుమ. సింహిక అంటే హింసించేది.అది కామరూపిణి.హనుమ నీడను పట్టి లాగటం గ్రహించాడు.మనిషి నిషిద్ధకర్మను గుర్తు పెట్టుకుని దాని వద్దకు వెళ్లి నాశనం అవుతున్నాడు. మనసులో కీడు అపకారం కుత్సిత భావాలు చేరకుండా జాగ్రత్త పడాలి. సంకల్ప వికల్ప సంఘాతం మనసు. ఇదే సూక్ష్మ శరీరం. లంక అంటే కాంచనం అంతా భోగభాగ్యాలు సుఖసంతోషాలు. అది త్రికూటంపై ఉంది. అది దక్షిణ దిక్కులో ఉంది. శరీరం చివరికి లంక అంటే రుద్రభూమికే చేరుతుంది. హనుమ ఆలోచిస్తూ లంకను చూస్తున్నాడంటే యోగి ఆత్మ దర్శనం చేశాడని అర్ధం. లంకలో సరోవరాలు కమలాలున్నాయి.ఉపాసనాకాలంలో యోగి కోతిలాగా త్వరగా కదలాలి ఆపై ఏనుగు లాగా స్థిరంగా ఉండాలి.కోరికలు ఫలవృక్షాలుగా లంకలో సమృద్ధిగా ఉన్నాయి. ఆశ్వయుజ శరత్కాలంలో దేవీ పూజ ఉపాసన చేస్తారు ఎందుకంటే శరీరం లో కొవ్వు బాగా పేరుకుపోతుంది.రక్తప్రసరణ లేక త్వరగా గుండె జబ్బులు వస్తాయి. మరణాలెక్కువ.అందుకే ఉపవాసాలు పూజలపేరుతో అమ్మని నవరాత్రుల్లో అర్చిస్తాం. అలాగే వసంత నవరాత్రుల్లో వడగాల్పులకి మరణాలు ఎక్కువ. అందుకే భగవదారాధన పేరు తో పూజలు మానసిక శాంతి కై చేస్తాం.అసలు లంకా పట్టణంని హేతి ప్రహేతి అనే రాక్షసుల కోరిక పై విశ్వకర్మ కట్టాడు.త్రికూటం సచేలం అనే కొండలని ఎన్నుకున్నాడు. లంక ని కుబేరుడికిచ్చాడు.రావణుడు బలవంతంగా దాన్ని లాక్కుని కుబేరుని వెళ్లగొట్టాడు.
కొసమెరుపు..
కాకినాడ అసలు పేరు కోకనదం అంటే ఎక్కడ చూసినా సరోవరాలు ఎర్రకలువలుండేవి.ఆంగ్లేయులు కో కెనడా అంటే ఇంకో కెనడా అనే అభిప్రాయం తో కోకెనడ అంటే అదికాస్తా కాకినాడ గా మారింది. 🌹
కొసమెరుపు..
కాకినాడ అసలు పేరు కోకనదం అంటే ఎక్కడ చూసినా సరోవరాలు ఎర్రకలువలుండేవి.ఆంగ్లేయులు కో కెనడా అంటే ఇంకో కెనడా అనే అభిప్రాయం తో కోకెనడ అంటే అదికాస్తా కాకినాడ గా మారింది. 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి