ఆశల రెక్కలు తొడుక్కున్న మమత ఊరు మమకారం
బలె బలే ఊరంటే పండుగ కదా!
అదేంచిత్రమో గానీ
నగరమంతా ఖాళీ ఖాళీ
ఉరుకుల పరుగుల నడక ఊరి దారిన
నిద్రరాత్రి అరుగుపై
కలల మిలమిల కదిలే విమానం
మూసిన కనుల ఆకాశం
దాగే మబ్బుల వెలుగు బతుకు కళ పగలు సొంతం
ఆటపాటల బాల్యం నవ్వు
ఊరు చేతులు కలిస్తే
వాకిలి లేని అపార్ట్ మెంట్ నగరం
ప్లాస్టిక్ నవ్వుల బతుకు
ఈ ఉడుకపోత ఆ కుండపోత నడుమ బతుకు గజిబిజి బిజీ బిజీ
నదులైన రోడ్లన్నీ నగరం గాధల బాధ
బతుకమ్మ దసరా పండుగకు
మనిషి ఊరు బాట
దేహం చెలిమి చెలిమెల సాగే
ఇల్లంతా మట్టి వాసన
పూల నెచ్చెలి గుండెగుండెల
అలాయ్ బలాయ్ ఊరూవాడ అందెలై
వదిలేసిన మమతల పొట్లం
మరువక విప్పుకొని రమ్మని పిలిచే
చినుకుల వాన వెచ్చని చలి ఊరుకు
సంకెల పంజరం రణగొణ నగరం
వీడి ఊరెళ్ళడమే ఓ హడావుడి సుమీ
పాట మురిసే అడుగేసే ఊరు ముంగిట
నా దేహంలో నా రక్తం
నాలో నా ఊరంచు ఊరించే గాలి
మమతల వేళ్ల చేవ్రాలే ఊరి గొప్ప
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి