దీపావళి అంటే.....🪔లక్ష్మీదేవికి నీరాజనం;- " కావ్యసుధ "
 ఆశ్వయుజ మాసం నాటి ఆఖరిరోజు అమావాస్యకు దీపావళిగా ఆచరిస్తాం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలిక లతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అనే పేరొచ్చింది.
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పరాయణే: దీపేన వరదాదీపం సంధ్యాదీపం ఏం నమోస్తుతే!!
భారతదేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ దీపావళి పండుగను దివ్వెలపండుగ, దివిటిపండుగ అని కూడా అంటారు. చైతన్యానికి ప్రతీక దీపం, సౌభాగ్యానికి సంకేతం జ్యోతి వెలిగించటం మంగళకరం. ఉత్తర భారతదేశంలో ఈ పండుగ ఐదురోజులు చేస్తారు. దక్షిణ భారత దేశంలో మూడు రోజులు చేస్తారు. నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి. ఈ పండుగ వెనుక అనేక కథలు వున్నాయి.
దుష్టరాక్షసుడు వరగర్వితుడులోకకంటకుడు అయిన నరకా సురుని బారినుంచి దేవతలను, మానవులను రక్షించడం కోసం శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై యుద్ధానికి బయల్దేరతాడు. నరకా సురుడితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చల్లి రథంపై ఒరిగి పోతాడు. అప్పుడు సత్యభామ ధనుర్భాణాలు చేతబూని నరకాసురు డితో యుద్ధం చేసింది. ఆశ్వయుజ చతుర్దశినాడు సత్యభామ నరకా సురుణ్ణి వధించింది. లోక కంటకుడైన నరకాసురుడు పీడ విరగడైన ఆశ్వయుజ చతుర్దశి నరక చతుర్దశి.
       సరక చతుర్దశినాడు అభ్యంగస్నానం చేసి, పిండివంటలు వండు కుంటారు. దీపావళినాడు నూతన వస్త్రాలు ధరించి లక్ష్మీపూజ చేసి విందు భోజనాలు చేస్తారు. రాత్రికి గృహాలను దేవాలయాలను నూనె దీపాలతో అలంకరించి బాజనందా కాలుస్తారు.
పూర్వం బలి చక్రవర్తి ముల్లోకాలను జయించి, దేవతల్ని తన అధీనంలోకి తీసుకొని రాజ్యపాలన చేస్తుండేవాడు. అపుడు దేవతల కోరికమేరకు విష్ణువు వామనావతారమెత్తి బలిని పాతాళ లోకానికి తొక్కివేసి దేవతల కోరిక నెరవేరుస్తాడు. అయితే బలి చక్రవర్తి దానగుణ శీలానికి మెచ్చుకొని పాతాళ లోకానికి అధిపతి అయ్యేలా వరమిస్తాడు. అందుకే పాఠాళవాసులు, భూలోకవాసులు ఆ రోజున ఆనందంగా దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటూ వుంటారు.
పద్మపురాణంలో మరోగాథ. దుర్వాస మహాముని శాపం వల్ల ప్రపంచంలో లక్ష్మీదేవి అదృశ్యం కావడంతో ప్రజలు అనేక కష్టాలతో వారిద్య్రంతో బాధపడుతుంటారు. ఆ సమయంలో అమృతం కోసం దేవదానవులు క్షీర సాగరాన్ని మధిస్తున్నారు. అప్పుడు లక్ష్మీదేవి లోక కళ్యాణార్థమై తిరిగి ఉద్భవించింది. ఈ విషయం గ్రహించిన ప్రజలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి దీపాలు వెలిగించి అర్చ నలు చేశారు. అందుకే నేటికీ దీపావళి సాయంత్రం లక్ష్మీ పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. దీపావళిని ఉత్తర భారత దేశంలో 'దీవాలి' అని అంటారు. ఈ పండుగను ఏ మతంవారు, ఏ ప్రాంతంవారు ఎలా పిలిచినా పండుగ పరమార్థం ఒక్కటే. మనిషిలోని అహంకారం నశించి మమకారం క్యారెక్టర్స్
 సమాజం లో ఉన్న చీకట్లు కొలగి అభివృద్ధి వెలుగులు ప్రకాశించా లన్నదే భక్తుల భావన. 🪔
" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
" సాహితీ శిరోమణి "
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
9247313488 : హయత్ నగర్ : హైదరాబాదు

కామెంట్‌లు