బడి పిల్లలo ( గేయం );- నన్నూరి. రఘు పాల్ రెడ్డి.
 పల్లవి
. పిల్లలం బడి పిల్లలం
వెన్నెల వెలుగుల దివ్వెలం
 చరణం . దేశ ప్రగతికి పునాదులం
శాస్త్ర ప్రగతికి కలామ్ లం
దేశసేవకు గులాం లం
మాతృభూమికి సలాం లం . పిల్లలం.  
చరణం. 
 ధైర్యం లో ఆంధ్రకేసరులం.
శౌర్యం లో సుభాష్ లం
ఆదర్శం లో వివేకానందులం.
ఆశయం లో ఆజాద్ లం.   . పిల్లలం.
చరణం.
  క్రమశిక్షణ కు దాసులం.
కర్తవ్యానికి దీక్షులం.
ప్రగతి పథంలో ప్రథంలం.
విజయానికి దిక్సూచులం. పిల్లలం.
చరణం. 

 మానవత్వం లో మహాత్ములం.
ధాతృత్వానికి విధాతలం.
శాంతి వనంలో కపోతలం.
స్నేహగీతానికి పల్లవులం. పిల్లలం.
                 
కామెంట్‌లు