కొన్ని పనులు అతిసామాన్యంగా తోస్తాయి కానీ అవి ప్రేరణ కల్గిస్తాయి.మిలియన్ షా సాఫ్ట్వేర్ ఇంజనీర్.ఏవస్తువైనా ఎక్స్పైరీ డేట్ రాకముందే కొని రాయతీపై అమ్మటంతో మంచి వ్యాపార బాటపట్టాడు. దాదాపు 3వేలరకాలవస్తువులు వాటికాలం చెల్లకముందే తన స్టోర్స్ లోకి చేరుస్తాడు.క్లిక్ చేస్తేచాలు దానివివరాలు అన్నీ తెలుస్తాయి.
నేడు చిన్న పిల్లల దగ్గర నుంచి పండువృద్ధులదాకా గృహ హింసలు.బైట బానిస వెట్టిచాకిరీ!పోలీసులను కలిసి చెప్పుకోవడం అంతసులభంకాదు. అలాంటివారికి అండదండలుగా ఉంటోంది సెయింట్ బ్రోసెఫ్ ఫౌండేషన్!ఆసంస్థ స్వచ్ఛంద సేవకులు వెంటనే రంగంలోకి దిగి సాయంచేస్తారు. సోషల్ మీడియాలో వారి నెంబర్లు వివరాలు తెలుస్తాయి.బెంగుళూర్ హైద్రాబాద్ చెన్నై పూణేలో 5వేలకేసులు నమోదైనాయి. దీనికి మూలకారకుడు32ఏళ్ల దుష్యంత్!వాట్సప్ లేని రోజుల్లో 16ఏళ్ల దుష్యంత్ బాడీగార్డ్ వెబ్సైట్ వినియోగదారుల ఆన్లైన్ కమ్యూనిటీలో చురుగ్గా ఉండేవాడు.ఫ్లారిడాలో ఆత్మహత్య చేసుకుంటున్నా అని ఓవ్యక్తి ప్రకటన తెలుసుకుని తల్లిఫోన్ తో అమెరికన్ పోలీసులకు ఫోన్ చేయడం వారు స్పందించడం తో అతనికలకి సాకారంగా బ్రోసెఫ్ ఫౌండేషన్ ని నెలకొల్పాడు. ఇంజనీరైనాక బెంగుళూర్ లో స్థిరపడి ఇలా తనసేవలు అందిస్తున్నాడు. 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి