కష్టే ఫలి : -యం.సహనశ్రీ, 6వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -రేగులపల్లి
 అనగనగా ఒక ఊరిలో బాలు,రాజు, చందు సుధీర్ అని నలుగురు స్నేహితులు ఉండేవారు. మీరందరూ ప్రాణ స్నేహితులు ఒకరినొకరు కలిసిమెలిసి ఉండేవారు సుధీర్ కి 11 సంవత్సరాలు చందు  రాజు మరియు బాలుకు కూడా11 సంవత్సరాలు ఒకరోజు ఈ నలుగురు ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద ఏనుగు పరిగెత్తుకుంటూ అటువైపు వచ్చింది.దాన్ని చూసి ఆ నలుగురు పరుగు తీశారు. పరిగెత్తుతూ పరిగెత్తుతూ సధీర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఆ ఏనుగు వెళ్ళాక వచ్చి ఆడటం మొదలుపెట్టారు ఆ మరుసటి రోజు  సుధీర్ పుట్టినరోజు పుట్టినరోజున మిగతా ముగ్గురూ మిత్రులు పొద్దున్నే లేచి సుధీర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అందరూ కలిసి పాఠశాలకు వెళ్లారు మిత్రులందరికీ మిఠాయిలు పంచారు ఆ తర్వాత రోజు నుంచి పరీక్షలని తరగతి ఉపాధ్యాయులు చెప్పారు. మళ్లీ ఇంటికి వచ్చి చదువుకొని ఉదయం పాఠశాలకు వెళ్లారు వారం రోజుల్లో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి ఫలితాలు వచ్చే రోజు రానే వచ్చింది .ఆ నలుగురిలో చందు కు మంచి మార్కులు వచ్చాయి మిగతా మిత్రులకు తక్కువ మార్కులు వచ్చాయి. ఆ ముగ్గురు చాలా బాధపడ్డారు చందు వాళ్ళని ఓదార్చాడు ఈసారి పోతే మళ్ళీ ఒకసారి బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోండి అని చెప్పాడు.ఏదైనా ప్రయత్నిస్తేనే ముందుకెళ్తామని చెప్పాడు. చందు సరే మిత్రమా మరోసారి ప్రయత్నిస్తాం అని మిగతా ముగ్గురు మిత్రులు చెప్పారు ఇప్పుడు వాళ్లు ఏడవ తరగతికి వచ్చారు ఈ సంవత్సరమైనా మంచి మార్కులు తెచ్చుకుందామని అనుకున్నారు ఆటలాడడం తగ్గించి చదవడం మొదలుపెట్టారు. ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్లారు పాఠశాల నుంచి వచ్చాక సాయంత్రం వేళల్లో ట్యూషన్ కు వెళ్లారు. సెలవు రోజుల్లో కూడా సమయం వృధా చేయకుండా పెండింగ్ హోంవర్క్ ను పూర్తి చేశారు. చదువుకున్నారు. ఏడవ తరగతి వార్షిక పరీక్షల్లో అందరు విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అందరూ చాలా ఆనందించారు 
సూక్తి కష్టపడితేనే ఫలితం ఉంటుంది

కామెంట్‌లు