శ్లో:!
ఆకీర్ణే నఖరాజికాంతి విభవైరుద్యత్సుధావైభవై
రైధౌతేపి చ పద్మ రాగలలితే. హంసవ్రజై రాశ్రితే
నిత్యం భక్తి వధూ గణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు
స్థిత్వ మానస రాజ హంస గిరిజానాధాంఘ్రి. సౌధాంతరే !!
భావం: మనస్సనే ఓ రాజహంసా ! గోళ్ళ వరుసలో
కాంతి చే కూడుకొనినదియు ప్రసరించుచున్న
అమృత ప్రవాహము చే కడుగ బడినదియు , పద్మము వంటి కెంపు వర్ణము చే ఇంపైనది యు,
పరమహంసల గుంపు చే ఆశ్రయింప బడినది యు
అగు పార్వతి పతి అయిన శివుని పాదము అనే
మేడ యందు ఉండి రహస్యముగా భక్తి అనే స్త్రీల
సమూహములతో స్వేచ్ఛగా విహరింపుము.
*******
శివానందలహరి:-కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి