నవ్వుతూ బ్రతకాలిరా -16:-సి.హెచ్.ప్రతాప్
 (1) మ్యూజియం లో హడావిడిగా తిరుగుతున్న వెంకటా చలం కాలు తగిలి ఒక  బొమ్మ విరిగిపోయింది.
"మీరు విరగిట్టిన బొమ్మ అయిదు వందల సంవత్సరాలది తెలుసా ?" కోపంగా అరిచాడు మ్యూజియం క్యూరేటర్.
" అమ్మయ్య, ఇంకా అది ఒక కొత్త బొమ్మ అనుకొని గాభరా పడ్దానయ్యా బాబు" తాపీగా ఊపిరి పీల్చుకున్నాడు వెంకటా చలం.
(2) జనరల్ డాక్టర్ కూ , స్పెషలిస్ట్ కూ తేడా ఏమిటి"
"ఒకరు నీకున్న రోగానికి వైద్యం చేస్తారు,మరొకరు తానూ వైద్యం చేసే రోగం నీకుందనుకుంటారు"
(3)"నీ పుట్టిన రోజు ఏమిట్రా రాజు" అడిగింది టీచర్.
"ఆగస్టు పధ్నాలుగు టీచర్"
"ఏ సంవత్సరం ?"
"ప్రతీ సంవత్సరం ఆగస్టు పధ్నాలుగే టీచర్" తాపీగా చెప్పాడు రాజు.
(4):స్వామీజీ నాకు ఒక మంచి ఉపదేశం ఇవ్వండి"దీనంగా ప్రార్ధించాడు రమణ.
"వెంటనే పెళ్ళి చేసుకో.వైవాహిక జీవితం విజయవంతం అయ్యిందా జీవితాంతం సుఖపడతావు, లేకపోతే తత్వవేత్త అవుతావు" చెప్పారు స్వామీజీ. 

కామెంట్‌లు