కలిస్తే మాట ముచ్చట కదిలితే ఆట ఊరు వదిలే
వలస బతుకు నగరీకరణ అయస్కాంత దారి
ఇరుగునొదిలిన మనిషి పొరుగు పరుగు కూడే
రణగొణల గోల వత్తిడి బతుకు పొరుగు సంత
మనిషి పట్టని వింత మనీ నడక సూటు బూటు
ఆపదలో పట్టని పక్కిళ్ళు అక్కర లేని చుట్టాలు
కాలేజి ఇల్లు ఆఫీసు బాటలే బతికే వెలుగు
హోటళ్ళు సినిమాలు కొత్త స్నేహాలు తిప్పే పేజీలు
టైంకు రాని రైలు సరిచేయు కాలం జీవి మనుగడ
ఊరు జాడల లేని ఇంగ్లీషు మోజు పెంచె జోరు
బాగున్నావా నమస్తే వీడి హాయ్ గుడ్ డే వచ్చే
ట్రాఫిక్ జామ్ జంజాటం వదిలించె జాంజాం గురి
ఆవుపాలు అమ్మమాట పాయె పిలిచే ఇరానీ కేఫ్
హోటలు హాస్టలు తిండి చూడని అమ్మచేతి ముద్ద
ఆత్మీయ హస్తాలు అక్కడక్కడ ఎడారి ఓయాసిస్సే
అలవాటుగా నడిచే దారుల పనులు సాగే
అక్షరం పిలువ పలికే బడి వడివడి బండి
చదువైనంక సాగి కదిలే మనిషి పల్లె గుండెకు
మట్టి నేలవీడి నగరదారుల పల్లె శనార్తులే చేసె
మంచి ఊరు ఆత్మ పంచే కొంత నగర జీవి నవ్వే
ఊరు మరువని మనిషి బతికే రంగులాటే పట్టక
===================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి