శాంతి లేని కాంతి భరోస లేని ప్రయాస పట్నం
భూకంపం సునామీ సమ్మెల ఆందోళన రోడ్డెంట
సగటు మనిషి ఆగం ఓపెన్ థియేటర్ నౌక
రంగుల వలయం చుట్టూ రంకెల సరదా పదా
బాధల ముల్లుగర్ర ప్రేమల సగటు జీవి రవి కవి
పెద్దపెద్ద రోడ్లు ఇండ్లు చీకటిగుహ బతుకు మనిషి
అమ్మ చుట్టే నిజం నింగి తాకే బతుకే ఆశ
వినోదాల కోట విహారాల ఖిల్ల జర బద్రం కొడుకా
ఆపద నీదైన నగరి ఎద కలత చెందు పల్లె అమ్మ
నగరాలన్నీ ఆకలి కుండల కడుపు నిండా పని
శ్రమ రాసిన కావ్యాలు చెమట మెరుపుల చీకటి
కలల కథలు తేలే వెన్నెల తీపిపాకం దరువు
మందుమాకులేని గాయాల వత్తిడి సమ్మెట
ఆటలు ఆడే మైదానం ఇరుకిరుకు హృదయం
ఈస్టమన్ కలర్ ఆట బలాదూర్ తోలుబొమ్మాట
తృణధాన్య చిరుధాన్య కూజన్స్ రుచి పల్లెకే చేర్చే
ఎక్కడున్నా మనసు ఊరైన మనిషి కష్టజీవి
మట్టి చేతుల మడతదెబ్బకే పట్ననీడ చేరదు దరి
రాజకీయ రగడ పాలన గడప నగరి ఆడని గాలి
ఎవరికెవరూ కారు కలిసెవ్వరూ రాని యంత్రసీమ
నీకు పడదు కాలుష్య కోర రెండుకత్తుల వొర
==============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి