ఒక చీమ కథ :-అన్వరుద్దీన్,; 6 తరగతి, జెడ్ పి హెచ్ ఎస్, అయిటిపాముల, కట్టంగూరు మండలం నల్గొండ జిల్లా

 అనగనగా ఒక చీమ ఉండేది అది చాలా ధనవంతురాలు అది చాలా మంచిది ఒకరోజు చీమ ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నది ఎందుకంటే ఎన్నో రోజులుగా స్వేచ్ఛగా తిరగాలి అనుకున్నది అయితే ఒకరోజు చీమ కల నెరవేరింది. అలా ఒక రోజు చీమ నడుచుతూ వెళుతుండగా రాయి అడ్డు తగిలింది తాను చూసుకోలేదు అయితే చీమ కింద పడ్డది అయితే ఒక పెద్ద ఉడత చూసి తాను కొన్ని ఆకులు తీసుకుని చీమ  దెబ్బ కా lడ రాసింది అలా చీమకు నొప్పి తగ్గింది అలా వాళ్ళు ఇద్దరు స్నేహితులు అయ్యారు దానివల్ల చీమ ఉడత ను తీసుకొని వెళ్ళింది అలా వాళ్ళు ఇద్దరూ కలిసి భోజనం చేశారు వాళ్ళిద్దరూ మంచి మిత్రులు అయ్యారు అప్పటినుంచి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు కలిసిమెలిసి ఉండడం జరిగింది
నీతి : ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటే మిత్రులుగా మారవచ్చు,  మిత్రులు కావడానికి డబ్బు అద్ది రాదు
      
కామెంట్‌లు