అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం చాలా చెడ్డది అయితే ఒకరోజు ఒక ఆవు తన బిడ్డ తోటి అడవిలో మేస్తున్నది. అయితే అక్కడికి ఒక సింహం వచ్చింది. మేస్తున్న ఆవులను చూసింది. సింహం తల్లి మీదకు వెళ్ళింది అప్పుడు అది పారిపోయి తన బిడ్డను దాచి పెట్టింది. కానీ తర్వాత సింహం అవును చంపింది. తల్లి చనిపోవడం చూసిన బిడ్డ చాలా కోపంగా ఉంది. సింహాన్ని చంపాలని అనుకున్నది. అయితే తనకు ఒక ఉపాయం వచ్చింది. ఆవు బిడ్డ సింహం దగ్గరికి వెళ్లి సింహం గారు సింహం గారు మీలాగా అడవిలో ఒక నకిలీ సింహం
తిరుగుతుంది అన్నది. దానికి సింహం ఏమన్నది అంటే నా అడవిలో తిరుగడం దానికి ఎంత ధైర్యం అని అన్నది. అయితే ఆవు బిడ్డ సింహంతో ఆ నకిలీ సింహం ఊబిలో దాచుకొని ఉన్నదని చెప్పింది. అవు బిడ్డ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరే సింహం మాత్రం ఆవు బిడ్డ నిన్ను ఆ నకిలీ సింహాన్ని చంపుతానని అనుకున్నది. వెంటనే ఆ ఊబి దగ్గరికి సింహం వెళ్ళింది. ఆ ఊబిలోకి దూకింది కథ అంతే కొట్టుకుంటూ చనిపోయింది. ఆవు బిడ్డ పగ తీరింది.
నీతి : ఆవు లాగా మీ ఇంట్లో ఎవరినైనా కోల్పోతే మీరు మీ చేతులతో కాకుండా తెలివితో చంపాలి.
ఉపాయం : సాత్విక్, 6 తరగతి అయిటిపాముల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి