స్ఫూర్తిదాతలు 81:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 డాక్టర్ ఆంటన్ యురేష్ కుమార్ కిడ్నీ రోగుల పాలిట దైవం.మద్రాస్ కిడ్నీ ఫౌండేషన్ లో బీదలకు ఉచిత ఆపరేషన్లు చేస్తున్న వైద్యుడు.12వక్లాస్ దాకా ప్రభుత్వ బడిలో చదివి టాపర్ గా నిల్చిన అతను తమిళనాడు ప్రభుత్వంఫ్రీ గా చదివించటంతో అలా సమాజసేవ చేయాలన్న ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వ డాక్టర్ గా సేవతో పాటు ఉచిత కోచింగ్ ఇచ్చిన ఘనత ఆయనది.చిన్నారులకి కిడ్నీ ఆపరేషన్ చేసిన ఘనత పిన్న వయసులో ప్రొఫెసర్ ఆంటన్!
డాక్టర్ రవికన్నన్ అడయార్ కేన్సర్ ఆస్పత్రి లో పనిచేసేవారు. అన్ని సౌకర్యాలు వదులుకుని  అసోంలోని కచర్ క్యాన్సర్ హాస్పిటల్ లో చేరారు.తేయాకు తోటల్లో కూలీలు క్యాన్సర్ బారిన పడుతున్నారు.ఒక ఎన్జీవో ఆధ్వర్యాన నడుస్తున్న దానికి డైరెక్టర్ గా వెళ్లారు.అక్కడ ఎలాంటి దుర్భర పరిస్థితులంటే  ఓస్త్రీ తనభర్త కి చికిత్స కోసం కొడుకుని భూస్వామిదగ్గర తాకట్టు పెట్టి వైద్యం చేయించింది. పేషెంట్ తో వచ్చిన ఓపిల్లాడు అన్నంలో నీళ్లుపోసుకుని పచ్చిమిరపకాయ నంచుకోటం చూసిన రవికన్నన్ ఉచిత భోజన వసతి కల్పించేదాకా ఆయన భార్య సీత ఇంట్లో వండి పంపేది.వాలంటీర్ గా పనిచేసింది. ఆశావర్కర్ల కి శిక్షణ ఇస్తున్నారు.టాటాట్రస్ట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సాయం అందుతోంది. ఈయన కి మెగసెసె అవార్డులభించింది🌹
కామెంట్‌లు