కేరళలోని వెంగోళ ప్రాంతసర్పంచ్ సుభాష్ పల్లికల్! వలసకూలీల పిల్లల భద్రత కోసం ఒక కేర్సెంటర్ ఏర్పాటుచేశాడు.ఉదయం 7నుంచి సాయంత్రం6దాకా ఆపిల్లలకి ఆహారం చదువు అందిస్తూ సంరక్షకులను ఏర్పాటుచేశాడు.చుట్టుపక్కల గ్రామాల కూలీల పిల్లలను తీసుకురావడంకోసం వ్యానులు యాంబులెన్స్ ఏర్పాటుచేసిన ఘనత సుభాష్ ది! శభాష్!
ముంబై పూణె లోకూడా ప్రేరణ ప్రోత్సాహం కల్గించిన వ్యక్తి కోల్కతాకి చెందిన సంతోష్ ది.ఆకలితో మాడే పిల్లల కోసంరోటీ కూర వ్యానులో పంపిణీ చేస్తున్నాడు.వ్యాన్లో కిచెన్ కూడా ఏర్పాటుచేశాడు.దాతలు కూడా సాయంచేస్తున్నారు.
నీటి కొరత ఉండే రాజస్థాన్ లో ఏడాదిపొడుగుతా చలివేంద్రాలు ఏర్పాటుచేసిన మహ్మద్ అబ్బాస్ పేదరికంవల్ల చదువుకోలేదు.తమ్ముడు చనిపోయాడు.ఆపిల్లాడిస్మృతికి తనవంతు సేవ గా ఓఆటో కొని వాటర్ ట్యాంకర్ ని పెట్టి 50 గ్రామాల్లో ఉదయం 5_రాత్రి11దాకా మొబైల్ చలివేంద్రం నడుపుతున్నాడు.ఆటలు భౌతిక మానసిక వికాసంకి తోడ్పడ్తాయి. సౌమిల్ మజుందార్ పర్మీందర్ గిల్ స్పోర్ట్స్ విలేజ్ ని ఏర్పాటుచేసి కబడ్డీ హాకీ ఖోఖో మొదలైన ఆటలు ఆడిస్తారు.పోషకాహారం ఇస్తారు.
ముంబైకి సమీపంలో ఉన్న కలోటే మోకాషిలో పిల్లలుస్క్వాష్ క్రీడలో శిక్షణ పొందుతున్నారు.రిత్విక్ భట్టాచార్య దీనికి ఆద్యుడు.గిరిజన పిల్లలు బాగా నేరుస్తూ జాతీయ స్థాయిపోటీల్లో సత్తా చూపుతున్నారు.
నిజామాబాద్ జిల్లా తూంపల్లి జడ్.పి.స్కూల్ పిల్లలు హాకీలో రాణించటానికి కారణం అధ్యాపకుడు సడక్ నగేష్!ఆయన కృషి పట్టుదలతో బాలికలతో సహా అంతా జాతీయ స్థాయిలో ఆర్మీ పోలీసు ఉద్యోగాలకు సెలక్ట్ కావడం విశేషం🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి