కరుణ ప్రేమ శాంతి కొండలు కరిగి
అన్యాయాక్రమాలు దౌర్జన్యాల పాపపు కొండలు
ఉత్తముండవైన దేవకుమారుడా
మేమంతా పాతకుండలము
చిల్లినావలో పయనించు మమ్ములనుద్ధరింప ఏటేటా వస్తావు
శాంటాక్లాజ్ తాత పంచే బహుమతులు అంతా మాకే కావాలనే స్వార్ధపరత్వం ని చూసి
నిర్వేదంగా నవ్వుతావా
మరియతనయుడా!?
పసులశాలలో పుట్టి గొర్రెల కాపర్ల భక్తిలో దారిచూపే తారలా వెలిగావు
సమస్త మానవాళి పాపప్రక్షాళనకోసం శిలువనే మోశావు
నేడు ప్రకృతివిలయంలో రైతన్నలు రోజూ మోసేది శిలువలే
నీ పుట్టుకతోటే కాలెండరుకి వయసు _ఏడాది ఇట్టే తిరుగు
ప్రగతిపథంలోనే జారుతున్న విలువలు
శాంతిపాటలు పాడుతూ తిరుగుతాం తూర్పు దేశపుజ్ఞానుల తలుచుకుంటూ
నడిపించు నానావ_ నడిసంద్రంలో
దేవా అని గుండె గుడి గంటలు మ్రోగిస్తాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి