చలిపులి గాండ్రింపులతో
నరనరాల్లో ఉత్తేజం నింపుటకోసం
కొంకర్లు తిరుగుతున్న చేతివ్రేళ్ళను
టీ గొంతులో పడగానే
దేహమంతా ఉష్ణోగ్రతలు
పెరిగి
పోయే ప్రాణం నిలిపే అపరసంజీవనీ
పరమౌషధం మీ "టీ"
అలసిన తనువులకు చైతన్యం నింపేసింది.
మేధోవికాసానికి ,ఒత్తిడి నివారణకు" టీ" దివ్యౌషధం
ఆకుపసరే "టీ "
టీ లవర్లకు ఇష్ట సఖీ.
ఆస్వాదించిన వారికి ఆస్వాదించినంత అనుభూతీ "టీ" ఎంతని చెప్పను "టీ" ఘనత
ఆంగ్లేయులు పరిచయం చేసిన
"టీ "
వారు మనదేశం వదిలిన మనం వదల్లేని విశేష జిహ్వ రుచివిశేషణమైనది" టీ"
అల్లం" టీ"
మసాలా" టీ"
సొంటి "టీ"
లెమన్ "టి"
ఇలాచి "టీ"
ఇరానీ "టీ"
ఎన్నని చెప్పను "టీ "రీతులు
తాగి ఆనందించవలసినదే
"టీ "
ధారతెగకుండా వ్రాస్తే కాఫీదండకంలా
"టీ "దండకమవుతుంది.
(టీ లవర్స్ అందరికీ తేనీటి (టీ) దినోత్సవ శుభాకాంక్షలతో.... )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి